ఈ రాశివారు ఈ వారంలో విజయాలు సాధిస్తారు..

Weekly Telugu Horoscope April 18th To April 24th - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. పాతస్మృతులు గుర్తుకు వస్తాయి.  వ్యాపారాలలో ముందడుగు వేసి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో  క్లిష్టసమస్యల నుంచి గట్టెక్కుతారు.  రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది.  కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయప్రయాసలను ఎదుర్కొంటారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్థిరాస్తుల కొనుగోలు నిలిపివేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కళారంగం వారికి ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణాలు తీరే సమయం. ఒక సమస్య నుంచి నేర్పుగా బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. 

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చాతుర్యంతో ఎదుటవారిని సైతం ఆకట్టుకుని పనులు చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీలో పట్టుదల పెరుగుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు అనూహ్యంగా పదవులు లభించే వీలుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి అనుకున్నరీతిలోనే కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. స్వయంకృషితో 
పనులు చక్కదిద్దుతారు. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. విద్యార్థుల కృషి ఫలించే సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరపతి పెరిగి మీ మాటే చెల్లుబాటు కాగలదు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో కుటుంబసభ్యులతో వివాదాలు. మానసిక అశాంతి. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. ఆకస్మిక ధనలబ్ధి. విలువైన సమాచారం అందుతుంది. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. సోదరులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.  ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. కళారంగం వారికి శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వాహన యోగం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. పారిశ్రామికవర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో సోదరుల నుంచి ఒత్తిడులు. వృథా ధనవ్యయం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. మహాలక్ష్మీ అష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థికంగా మరింత బలపడతారు. కొన్ని రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. స్థిరాస్తులు కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఏ పని చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబంలో సమస్యలు  పరిష్కరించుచకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. సోదరుల నుంచి ఆస్తుల విషయంలో శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అదనపు భారం తగ్గి ఊరట చెందుతారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం  మధ్యలో మిత్రులతో కలహాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. బంధువుల నుంచి కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని మిత్రులతో పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించినంతగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రారంభంలో చిక్కులు నెలకొన్నా క్రమేపీ సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే వీలుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగుతారు. స్థిరాస్తుల వివాదాలు పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి కార్యసిద్ధి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగల సూచనలు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ధనవ్యయం. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top