ఈ రాశివారికి వారం ప్రారంభంలో శ్రమాధిక్యం

Weekly Horoscope In Telugu 4th July To 10th July 2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కష్టసుఖాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహావిష్ణుధ్యానం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఏ పనినైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. అయితే మధ్యలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా అధిగమిస్తారు. ఎదురుచూస్తున్న ఒక అవకాశం మాత్రం చేజారే వీలుంది. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి రుణబాధలు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలలో మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాల యత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీసూర్యప్రార్ధన మంచిది.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మధ్యమధ్యలో కొన్ని చికాకులు ఎదురైనా తట్టుకుని నిలబడతారు. మీ ఆలోచనలకు మరింత పదునుపెడతారు. ఎటువంటి పనులైనా నేర్పుగా పూర్తి చేస్తారు. భూవివాదాలు కొలిక్కి వచ్చే అవకాశం. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పెండింగ్‌లో ఉంచిన పెళ్లి మాటలు సఫలమవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. కళారంగం వారి ఆశలు కొన్ని నెరవేరతాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆప్తులతో విభేదాలు. ఎరుపు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ ధ్యానం చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలపై బంధువులతో చర్చిస్తారు. ఆర్థిక విషయాలు మరింత మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో మరింత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అందరిలోనూ మీ మాటకు ఎదురుండదు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్య నుంచి గట్టెక్కుతారు. లక్ష్యాల సాధనలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు శుభవర్తమానాలు. భూములు, వాహనాల కొనుగోలు. ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ పుంజుకుంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనిస్తారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాల విస్తరణ పూర్తి చేస్తారు. కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కళారంగం వారికి కొంత సానుకూలం. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తుతి మంచిది.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన పనులలో కొంత ఇబ్బంది ఏర్పడినా అధిగమిస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంటి నిర్మాణాలపై ప్రతిష్ఠంభన తొలగుతుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగుతుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. సన్నిహితుల నుంచి ఒత్తిడులు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా మనోధైర్యంతో అధిగమిస్తారు. అనుకున్న పనులు సజావుగా సాగేందుకు కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఆశించిన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. పసుపు, నేరేడురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు కొంత తీరే సమయం. బంధువుల సలహాలు కొన్ని స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థుల కష్టానికి ఫలితం దక్కుతుంది. గృహయోగం. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు దక్కించుకుంటారు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మీ శ్రమకు తగిన ఫలితం దక్కే సమయం. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేయడంలో స్వశక్తిపైనే ఆధారపడతారు. భూవివాదాలు పరిష్కారమయ్యే సూచనలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. బంధువులను కలుసుకుని మీ భావాలను వెల్టడిస్తారు. ఇంటి నిర్మాణాల్లో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
మొదట్లో వివాదాలు, సమస్యలు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఊరట చెందుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం కాస్త తగ్గుతుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు.  కుటుంబసభ్యులతో విభేదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఏ వ్యవహారమైనా చక్కదిద్ది ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊరట చెందే ప్రకటన రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. వ్యయప్రయాసలు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు ఎదురుకావచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. బంధువుల వైఖరితో మనస్తాపం చెందుతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో కొంత జాప్యం. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలు ఆచితూచి అడుగువేయడం మంచిది. వారం మధ్యలో శుభవార్తలు. నూతన ఉద్యోగయోగం. ఆస్తిలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు.  ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top