Weekly Horoscope: ఈ రాశివారికి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది

Weekly Horoscope In Telugu 30-01-2022 to 05-02-2022 - Sakshi

మేషం
అనుకున్న కార్యక్రమాలు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు తీరతాయి. దూరపు బం«ధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. కాంట్రాక్టులు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం
పనులు సమయానికి పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. గతంలో చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. కొత్త బాధ్యతలు తప్పకపోవచ్చు. లేత ఎరుపు, చాక్లెట్‌రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం
యత్నకార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, చాక్లెట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

సింహం
దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. చోరభయం.  లేత ఎరుపు, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

కన్య
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు.  వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

తుల
ముఖ్యమైన కొన్ని పనులు అనుకున్నరీతిలో పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. నూతన ఉద్యోగప్రాప్తి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. అనారోగ్యం.  ఎరుపు, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృశ్చికం
ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొనే అవకాశం. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలబ్ధి. ఆకుపచ్చ, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. వాహనాలు, ఇళ్లు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగఛాన్స్‌. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు  కొత్త అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. ఇంటాబయటా సమస్యలు ఎదురవుతాయి. గులాబీ, చాక్లెట్‌ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం
ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం మధ్యలో బంధుమిత్రుల నుంచి సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. ధనవ్యయం. నీలం, చాక్లెట్‌ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగులకు కొంత పనిభారం తప్పదు. కళాకారులకు నిరుత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, తెలుపురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం
పనులు నిదానంగా పూర్తి చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో కొంత ప్రగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారుల యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో తగాదాలు.  ఎరుపు, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top