Weekly Horoscope: 27 మార్చి నుంచి 2 ఏప్రిల్‌ 2022 వరకు

Weekly Horoscope In Telugu 27-03-2022 To 02-04-2022 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఏ పని చేపట్టినా విజయవంతంగా సాగిపోతుంది. సమస్యలను అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థికంగా ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. పారిశ్రామికవర్గాలకు అన్ని విధాలా అనుకూల సమయం. వారం చివరిలో వ్యయప్రయాసలు.  పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
మీ కష్టం ఫలిస్తుంది. కొత్త పనులు చకచకా కొనసాగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. రుణవిముక్తి లభిస్తుంది. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహించే వీలుంది. వాహనాలు, ఇళ్ల కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారు ఊహించని కొన్ని అవకాశాలు సాధిస్తారు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో ఇబ్బందులు, సమస్యలు కొంత కలత పెట్టవచ్చు. అయితే రానురాను పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో మీరు చెప్పినట్లే జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆలోచనల అమలులో కుటుంబసభ్యులు సహకరిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో హోదాలు అనూహ్యంగా దక్కుతాయి. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కుజస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా వ్యవహరించి శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలులో అడుగు ముందుకు వేస్తారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలలో రావలసిన పైకం అందుతుంది. ఉద్యోగాలలో కొత్త విధులు చేపడతారు. పారిశ్రామికరంగం వారికి చెప్పుకోతగిన అభివృద్ధి కనిపిస్తుంది. వారం మధ్యలో శ్రమాధిక్యం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్న వ్యవహారాలు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ఆశలు ఫలించే సమయం. భూవివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు సైతం మీకు మద్దతుగా నిలుస్తారు. వాహనయోగం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నేరేడు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. ఆపదలో ఉన్న వారికి మీ సేవలు అందిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి అందిన సమాచారం మీలో నూతనోత్సాహం నింపుతుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. కళారంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఎటువంటి పనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సమావేశాలకు నేతృత్వం వహిస్తారు. ఆర్థిక పరిస్థితి సమతూకంగా ఉంటుంది. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాల ఆశలు ఎట్టకేలకు ఫలిస్తాయి. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రశంసలు అందుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం అందుతుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. కళారంగం వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కొన్ని విషయాలలో మానసిక అశాంతికి లోనవుతారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం వీడక ముందుకు సాగడం మంచిది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. పనులలో అవాంతరాలు నెలకొని పరీక్షగా నిలుస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనాలు కొంటారు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చేపట్టిన వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ కృషి, సేవలను కుటుంబసభ్యులు గుర్తిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.  స్థిరాస్తులు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. కళారంగం వారి చిరకాల కోరిక నెరవేరుతుంది. వారం చివరిలో అనారోగ్యం. బంధువుల నుంచి సమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యతిరేకులను కూడా ఆకట్టుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. మిత్రుల నుంచి ధనలాభ సూచనలు. రాబడి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొద్దిపాటి పదవులు దక్కే సూచనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పొరపాట్లు సరిదిద్దుకుని చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి అందిన సమాచారంతో ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో అంచనాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వివాహాది వేడుకలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఎంతటి వారినైనా చాతుర్యంగా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ విధుల్లో ఒత్తిడులు అధిగమిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top