ఈ రాశివారు వారంలో అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు

Weekly Horoscope In Telugu 20-03-2022 To 27-03-2022 - Sakshi

మేషం...
ముఖ్య పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతితో ముందుకు సాగుతారు.  సన్నిహితులతో వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం. వాహనయోగం.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఎరుపు, నేరేడురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

వృషభం...
నిరుద్యోగులకు భవిష్యత్‌పై ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులు నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త కాంట్రాక్టులు కొన్ని లభిస్తాయి.  ఆస్తుల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి,  లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం  ప్రారంభంలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

మిథునం...
అనుకున్న వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో విభేదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి లేదా ధనలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాల మరింత ఆశాజనకంగా ఉంటుది. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం..
కొత్త వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత  ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని హోదాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ఆకుపచ్చ, తెలుపురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

సింహం...
పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు.  మిత్రులతో కొన్ని వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య...
ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆసక్తికర సంఘటనలు ఎదురుకావచ్చు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. శుభకార్యాలపై బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

తుల...
అనుకున్న ఆదాయం సమకూరుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి తగాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడుల నుండి బయటపడతారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయ,కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. విచిత్ర సంఘటనలు. ఎరుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం....
ముఖ్య వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు పరిష్కారవుతాయి. విద్యార్థులను ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. పలుకుబడి మరింత పెరుగుతుంది.  బం«ధువులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో  చికాకులు తొలగుతాయి, కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు...
కొత్త పనులు ప్రారంభిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన సమాచారం అందుతుంది. మీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థుల ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది.  కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలలో పురోగతి సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో  ఉన్నతహోదాలు. రాజకీయవర్గాలకు  ఊహించని పదవులు లభిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు.  తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

మకరం...
చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది.  ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో పురోగతి, ఆశించినంత లాభాలు దక్కుతాయి.  ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. విధులు ప్రశాంతంగా సాగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం...
ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.. అనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చే స్తారు. ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. దైవదర్శనాలు చేసుకుంటారు.  వాహన,గృహయోగాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.  వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా మారతాయి. ఉద్యోగాలలో  అంచనాలు నిజం కాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం....
ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్నది సా«ధిస్తారు. కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. . స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగ విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top