ఈ రాశివారికి వారం మధ్యలో శుభవార్తలు

Weekly Horoscope In Telugu 19-12-2021 to 25-12-2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చాకచక్యం, లౌక్యంతో నెట్టుకొస్తారు. ముఖ్య వ్యవహారాలలో పట్టువిడుపు ధోరణి మంచిది. సోదరులతో ఆస్తి తగాదాలు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. చేపట్టిన పనులు∙నిదానిస్తాయి. ఇంటాబయటా సమస్యలు చికాకు పరుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అవరోధాలు. ఆరోగ్యం, వాహనాలు విషయంలో మరింత శ్రద్ధ వహించడం మంచిది. స్వల్ప లాభాలు. ఉద్యోగులు ఎంత కష్టపడ్డా మాటపడతారు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శుభవార్తలు. ఉద్యోగలాభం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. చాకచక్యంగా ముఖ్య వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు అందిన సమాచారం ఊరటనిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కార్యరంగంలోకి దిగితే విజయాలే. ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు.  ఊహలు, అంచనాలు నిజం చేసుకుంటారు. మీ ఆధిక్యతను చాటుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు.గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. వాహనాలు కొంటారు. వ్యాపారస్తులు అనుకున్న  లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు, పదోన్నతులను పొందుతారు. కళారంగం వారి ఆశలు ఫలించి ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. నీలం, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆలోచనా శక్తి, ఇతరులను ఆకట్టుకునే తత్త్వంతో ఊహించని విజయాలు సాధిస్తారు. ఏ పని చేపట్టినా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక లావాదేవీలు అనుకున్నరీతిలో ఉంటాయి. ఇంటి నిర్మాణాలు పూర్తికావచ్చే సమయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.. ధార్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తులు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విశేష గుర్తింపు తథ్యం. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. దూరమైన ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. దీర్ఘకాలంగా నెలకొన్న ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. వివాహాది శుభకార్యాల నిర్వహణకు డబ్బు వెచ్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు.  వ్యాపారాలలో  ఊహించని విధంగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ పనివిధానాన్ని అందరూ గుర్తిస్తారు. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కార్యజయం. దూరమైన కొందరు మిత్రులు తిరిగి దగ్గరకు చేరతారు. కుటుంబంలో సుఖసంతోషాలతో గడుపుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. యుక్తితో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఉద్యోగలాభం. ఒక కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తుంది. ఆరోగ్యం∙కుదుటపడుతుంది. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహంతో ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆత్మవిశ్వాసం, ధృడదీక్షతో సాగి అనుకున్న లక్షా్యలు సాధిస్తారు. ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.  వ్యాపారాలు ఊపందుకుంటాయి. అనుకున్న మేరకు లాభాలు. ఉద్యోగాలలో అనుకూల బదిలీలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆత్మస్థైర్యమే  ఆయుధంగా పనిచేస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. కొన్ని తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగుతాయి.  గతంలో నిలిచిపోయిన పనులు కూడా పూర్తి చేస్తారు.  స్థిరాస్తి వృద్ధి.  కోర్టు వ్యవహారాలలో అనుకూలత. ఇంటిæ నిర్మాణాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్యలో కొద్దిపాటి చిక్కులు కలిగినా అధిగమిస్తారు. ఉద్యోగాలలో మీ  ఊహలు ఫలిస్తాయి. రాజకీయవర్గాలకు అనుకోని విజయాలు వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. రుణదాతల ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయటపడతారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగలాభం పొందుతారు. గృహ నిర్మాణాలు సాగిస్తారు. ఆరోగ్యపరమైన చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలు, మంచి గుర్తింపు తథ్యం. పారిశ్రామికవర్గాలకు అనుకూల కాలం.  కళారంగం వారికి అవకాశాలు మరింత దక్కుతాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. శ్రమాధిక్యం. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని ఆరాధించండి. 

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. కొన్ని సమస్యలను సొంత ఆలోచనలతో పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి కలిగిన వారికి పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొంటారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల ఆశయాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కొన్ని విజయాలు చేకూరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో పురోగతి సాధిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. మిత్రులతో విభేదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు. కళారంగం వారికి ప్రోత్సాహకరం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. 

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన  పనులను శ్రమపడ్డా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.  దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తరచూ పుణ్యక్షేత్రాల సందర్శనం. ఉద్యోగయత్నాలు కలిసివచ్చే అవకాశం.  వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా నడుస్తాయి.  ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి కొన్ని విజయాలు దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top