Weekly Horoscope: ఈ రాశివారికి వ్యాపారాల్లో లాభాలు

Weekly Horoscope In Telugu 13-02-2022 To 19-02-2022 - Sakshi

మేషం...
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సమాజంలో  గౌరవప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను  కలుసుకుని మరింత ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులు ప్రతిభకు పదునుపెడతారు. ఉద్యోగయత్నాలు  అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు  ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తల శ్రమ కొలిక్కి వస్తుంది.వారం మధ్యలో  ధనవ్యయం. అనారోగ్యం. శ్రమాధిక్యం. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి..

వృషభం...
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు తప్పవు.ఇంతకాలం పడ్డ శ్రమ కొంత మేర ఫలిస్తుంది. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.ఒక ప్రకటన విద్యార్థులను కొంత ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కించుకుంటారు. అయితే భాగస్వాములతో కొన్ని విభేదాలు తప్పవు. ఉద్యోగ విధి నిర్వహణలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి.  వారం మధ్యలో శుభవార్తలు. ధనప్రాప్తి. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి..

మిథునం...
కొత్త విధానాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు.  మీరు సూచించిన ప్రతిపాదనలకు కుటుంబసభ్యుల ఆమోదం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. ఎటువంటి వారినైనా ఆకట్టుకుంటారు. శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో పదోన్నతులకు మార్గం ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారుల శ్రమ ఫలించే సమయం. వీరికి ఊహించని విదేశీ పర్యటనలు ఉండవచ్చు.   వారం చివరిలో సోదరులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిళ్లు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం...
కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. బంధువుల తోడ్పాటుతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. భూ,గృహయోగాలు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో గతం కంటే మెరుగైన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి..

సింహం...
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభం.యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు. ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది. కుటుంబ సమస్యలు, కోర్టు వివాదాలు కొంత వరకూ పరిష్కారం.ఇంటాబయటా మీదే పైచేయిగా నిలుస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు.ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.వ్యాపారాలలో కొత్త భాగస్వాములతో ఒప్పందాలు. ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తల  యత్నాలు సఫలం.  వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కన్య..
చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు.సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.కొత్త కాంట్రాక్టుల కోసం యత్నాలు సఫలమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో  పైస్థాయి నుంచి ఒత్తిడులు పెరిగినా సమర్థతను చాటుకుంటారు. రాజకీయవేత్తలు, కళాకారులు  ఆశించిన లక్ష్యాలు చేరుకుంటారు. వారం  చివరిలో అనుకోని ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల...
అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. తగింత సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి. కోర్టు కేసులు పరిష్కారవుతాయి.  సన్నిహితులు, మిత్రుల  చేయూతతో ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇళ్లు, స్థలాలు కొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి, భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఊరటనిస్తాయి. రాజకీయవర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో  కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృశ్చికం...
కొత్త పనులు చేపడతారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తి విషయాలలో నూతన అగ్రిమెంట్లు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వివాహ వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. విస్తరణయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ విధి నిర్వహణ ఉత్సాహంగా ఉంటుంది. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో  అనుకోని ఖర్చులు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

ధనుస్సు...
ఆర్థిక పరిస్థితి  మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు.ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్యసమాచారం.భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం.వాహన, గృహయోగాలు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగ  విధి నిర్వహణలో ఆటుపోట్లు అధిగమిస్తారు. కళాకారులు, రాజకీయవేత్తలకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. శారీరక రుగ్మతలు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మకరం...
ఆశించిన రాబడి సమకూరి ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలు నిదానంగా కొనసాగుతాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. గృహ,వాహనయోగాలు కలుగుతాయి. స్థిరమైన ఉద్యోగాలు దక్కుతాయి. ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి గట్టెక్కుతారు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అనుకున్న విధంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కొత్త పరిశ్రమలు, కంపెనీల ఏర్పాటులో చికాకులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అతిధుల ద్వారా కీలక సమాచారం. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం...
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. మీ ప్రతిభాపాటవాలకు తగిన ప్రోత్సాహం అందుతుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి వ్యవహారాలు చక్కదిద్దుతారు. భూములు, ఆభరణాలను కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. పారిశ్రామిక,రాజకీయవేత్తలకు మరింత సానుకూలమైన సమయం.  వారం ప్రారంభంలో బంధువిరోధాలు. మానసిక ఆందోళన. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

మీనం...
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అంచనాలు నిజమవుతాయి. ఆలోచనలు అమలులో ఆటంకాలు అధిగమిస్తారు. కొన్ని వేడుకలకు హాజరవుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. యుక్తితో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగ విధులలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆశలు చిగురిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్య సూచనలు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top