Weekly Horoscope: ఈ రాశివారు వివాహయత్నాలను ముమ్మరం చేస్తారు

Weekly Horoscope In Telugu 06-02-2022 to 12-02-2022 - Sakshi

మేషం
ఆర్థిక లావాదేవీలు ఆశాజకనంగా ఉంటాయి. ధనలాభాలు ఉండవచ్చు. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం.  ఎరుపు, గోధుమ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

వృషభం
పనుల్లో ప్రతిష్ఠంభన తొలగి ముందుకు సాగుతారు. అనుకున్న విజయాలు సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకుపచ్చ, ఎరుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మిథునం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంతో గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. కొన్ని ఆహ్వానాలు ఉత్సాహపరుస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగుపడి అవసరాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఆదరణ దక్కవచ్చు. వారం మధ్యలో మానసిక ఆందోళన. వ్యయప్రయాసలు.  తెలుపు, లేత నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం
కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు, విదేశీ విద్యావకాశాలు సైతం దక్కవచ్చు.. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ఇంటి నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు ఊహించని విధంగా విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళారంగం వారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.  వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. తెలుపు, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

సింహం
కొన్ని వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు నెలకొనవచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి.  ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ఆప్తులతో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, చాక్లెట్‌ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేసుకోండి.

కన్య
ముఖ్యమైన పనులు నెమ్మదించినా చివరికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం రావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు భాగస్వాముల నుంచి అనుకూల సంకేతాలు రాగలవు.  ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి.  వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబంలో సమస్యలు. నీలం, చాక్లెట్‌ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

తుల
ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ఆలోచనలు మరింత కలసివస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వివాహయత్నాలను ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు  ప్రతిభాపాటవాలు వెలుగులోకి  వస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు అనుకున్న సమయానికి విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలకు విశేషంగా కలసివస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఎరుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృశ్చికం
చేపట్టిన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తి కాగలవు. ఆప్తులు, మిత్రుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి. విద్యార్థుల యత్నాలలో పురోగతి ఉంటుంది. శుభకార్యాల నిర్వహణలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు కొన్ని గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.  కళారంగం వారికి కొత్త ఆశలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ పూజలు చేయండి.

ధనుస్సు
ప్రారంభంలో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. సోదరులు, మిత్రులతో వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్త కుదుటపడతాయి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో మరింత అనుకూలత ఉంటుంది.  గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించే సూచనలు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. తెలుపు, లేత నీలంరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి.

మకరం
ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు కొంతమేర సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం పెరిగినా సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి  అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో బంధువులతో తగాదాలు. ఆరోగ్యం అంతగా సహకరించదు. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కుంభం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. అవసరాలకు రుణాలు చేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరుల నుంచి మాటపడతారు. ఆరోగ్యపరంగా చికాకులు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు.  వ్యాపారాలు నత్తనడకన సాగి స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఇతరుల బాధ్యతలు సైతం మోయాల్సిన పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు  శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. యత్నకార్యసిద్ధి. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతను పూజించండి.

మీనం
వ్యవహారాలలో విజయం మీదే. ఆప్తులు , సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించాలన్న తపన పెరుగుతుంది. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వివాహయత్నాలు సానుకూలం. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. గులాబీ, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top