Weekly Horoscope: 3 ఏప్రిల్‌ నుంచి 9 ఏప్రిల్‌ 2022 వరకు

Weekly Horoscope In Telugu 03-04-2022 To 09-04-2022 - Sakshi

మేషం...
ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల ఆదరణ పొందుతారు. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు తమ సమర్థతను చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మ«ధ్యలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

వృషభం...
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని  ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం  ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అష్టలక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మిథునం...
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. మీమాటకు ఎదురుండదు. బంధువర్గంతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూ, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం.  వారం మ«ధ్యలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం..
పనులు చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు. కళారంగం వారికి  పురస్కారాలు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.
సింహం...
చాకచక్యం, నేర్పుతో సమస్యల నుంచి బయటపడతారు. వ్యవహారాలలో విజయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. ఉద్యోగులకు కాస్త అనుకూలమైన కాలమనే చెప్పాలి. పారిశ్రామికవర్గాలకు  ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
కన్య..
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. గృహం, వాహనాలు కొంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు.నిరుద్యోగులకు శుభవార్తలు. చిరకాల ప్రత్యర్థులు మీతో చేయి కలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులు కొంత సాయం అందిస్తారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాల వారి దీర్ఘకాలిక కల ఫలిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గామాతను పూజించండి.. 
తుల...
మొదట్లో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా  క్రమేపీ అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. గతంలో దూరమైన సన్నిహితులు దగ్గరవుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అం§తతాయి.. వాహనయోగం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఆశించినస్థాయిలో  లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళారంగం వారికి çపూర్వవైభవం.  వారం మ«ధ్యలో మానసిక ఆందోళన, చికాకులు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
వృశ్చికం...
ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాల నుంచి బయటుపడతారు. ఇంటి నిర్మాణయత్నాలలో కదలికలు ఉంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కొన్ని సూచనలు రావచ్చు.  వ్యాపారాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి. . ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగే సమయం. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు లభించవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు..
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగయత్నాలలో పురోగతి ఉంటుంది. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో  స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు. మానసిక ఆందోళన. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.
మకరం...
మొదట్లో కొంత చికాకులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఆ««ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. ఊహకు అందని విధంగా ఉద్యోగావకాశాలు లభించే సూచనలు. మ్రుఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీ పనితనాన్ని పైస్థాయి వారు గుర్తిస్తారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
కుంభం...
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో స్తబ్ధత తొలగుతుంది. ఇంతాకాలం పడిన శ్రమ ఫలించి విద్యార్థులు ఊరట చెందుతారు. సన్నిహితులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని అవకాశాలు దక్కవచ్చు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. అలాగే, మంచి గుర్తింపు సైతం లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబంలో సమస్యలు. నీలం, నలుపు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మీనం...
చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు చేస్తారు. సోదరులు, బంధువర్గంతో  వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలతో కొంత కుస్తీ పడతారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఇష్టంలేకున్నా మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొన్ని ఒడిదుడుకులు ఎదురుకావచ్చు.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top