వారఫలాలు (1 నవంబర్‌ నుంచి 7 నవంబర్‌ 2020 వరకు)

Weekly Horoscope From November 1st To November 7th 2020 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల ఉద్యోగయత్నాలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. పెండింగ్‌ బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  యుక్తి, సమర్థతతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి.  ఉద్యోగాలలో క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది.  కళారంగం వారికి కొంత ఊరట లభించే సమయం.  వారం చివరిలో అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సాయం అందుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు నూతనోత్సాహం. ఒక సమాచారంతో మరింత ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలను అత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆలోచనలు అమలులో ఆటంకాలు తొలగుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. ఖర్చులను అదుపు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింత పురోగతిలో సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి తొలగుతుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడుల నుంచి విముక్తి.  వారం చివరిలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచ ముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. సన్నిహితులతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అత్యంత నేర్పుగా కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి.  విస్తరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తారు. ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి  ప్రశంసలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పరిచయాలు మరింత విస్తరిస్తాయి. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలలో లాభాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట చెందుతారు. కళారంగం వారి కృషి కొంతమేర ఫలిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్యం. గులాబీ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
శ్రమ కొంత ఫలిస్తుంది. కొత్త పనులు ప్రారంభించి కష్టసాధ్యమైనా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. రావలసిన సొమ్ము సమయానికి అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు గతం కంటే  లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వారం ప్రారంభంలో వివాదాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక విషయాలు  సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమాచారం మీలో మరింత సంతోషం కలిగిస్తుంది. కొత్త పనులు  ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల నుంచి మాట సహాయం. వాహనాలు, భూములు కొనుగోలు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. భాగస్వాముల నుంచి మరింత సానుకూలత. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది. రాజకీయవర్గాలకు కొన్ని ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనులు అనుకున్న  సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే అంతా ఇష్టపడతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, హడావిడితో గడిచిపోతుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికరంగం వారి కృషి కొంత ఫలిస్తుంది. వారం చివరిలో భూవివాదాలు. ఆరోగ్యభంగం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. రుణబాధలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలను కొలిక్కి తెచ్చుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి.  వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి కార్యసిద్ధి. గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల  సమాచారం అందుతుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో కలహాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో నెలకొన్న కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. సోదరులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రావచ్చు.  వ్యాపారాలలో చికాకులు తొలగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి. పారిశ్రామికరంగం వారికి  శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు తప్పకపోవచ్చు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. రుణయత్నాలు సాగిస్తారు. ఏదో ఖర్చు ఎదురై ఇబ్బంది పడతారు. పనుల్లో ఆటంకాలు చికాకు పరుస్తాయి. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులకు  శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు.  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొంత ఊరట లభించే సమయం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
-సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు  

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top