వారంలో ఈ రాశివారు శుభవార్త వింటారు

Weekly Horoscope From December 27th To January 2nd - Sakshi

వారఫలాలు(27 డిసెంబర్‌ నుంచి 2 జనవరి 2021 వరకు)
మేషం : (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్తగా చేపట్టిన పనులు ముందుకు సాగక ఇబ్బందిపడతారు. ఆర్థిక విషయాలు కొంత నిరాశపర్చినా అవసరాలు తీరతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. స్థిరాస్తి వివాదాలు తలెత్తడంతో సతమతమవుతారు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు ఉండవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి  స్తోత్రాలు పఠించండి.

వృషభం : (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. యుక్తితో సమస్యల నుంచి గట్టెక్కుతారు.  వ్యాపారాలు మరింత లాభిస్తాయి. కొత్త భాగస్వాముల సహాయం అందుతుంది. ఉద్యోగాలలో మీ ఉన్నతిని చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం చివరిలో  ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మిథునం : (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
వ్యయప్రయాసలతోనే కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. తరచు ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. పరిస్థితులు అంతగా అనుకూలించక డీలాపడతారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా ఏదో విధంగా అవసరాలు తీరతాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. మరిన్ని బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన మంచిది.

కర్కాటకం : (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలు సమయానికి పూర్తి చేస్తారు. పరిపరివిధాలుగా ఉండే ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక విషయాలలో గందరగోళ పరిస్థితి నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహాయపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. విస్తరణ కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూంం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం : (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. గృహ, వాహనయోగాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదల, ధైర్యంతో కొన్ని వివాదాలు నుంచి గట్టెక్కుతారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉండవచ్చు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్య సూచనలు. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య : (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. సన్నిహితులు నుంచి శుభవార్తలు వింటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యలను ఓర్పుతో పరిష్కరించుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు లక్ష్యసాధనలో ముందడుగు వేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తుల విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. కొత్త భాగస్వాములతో అంగీకారానికి వస్తారు. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్త రుణాల వేటలో పడతారు. ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. మీ శ్రమ కొన్ని వ్యవహారాలలో వృథా కాగల సూచనలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. కొత్త వ్యక్తుల పరిచయం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం : (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. సోదరులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. మీ అభిప్రాయాలను కుటుంబంలో నిర్భయంగా చెప్పగలుగుతారు. వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో సహచరులతో ఇబ్బందులు నెలకొనవచ్చు. కళారంగం వారికి నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఎరుపు, పసుపు రంగులు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పాతవిషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గి ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఎటువంటి వివాదమైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. ఒక మిత్రుని ద్వారా అందిన సమాచారం మీలో కొత్త ఆశలు నింపుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని హోదాలు దక్కవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కుంభం : (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు  నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం తప్ప ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు తప్పవు. విద్యార్థులకు ప్రయత్నాలు మందగిస్తాయి. అన్ని వ్యవహారాలలోనూ యుక్తిగా మసలుకోవడం మంచిది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి కాగలరు. పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు. వారం చివరిలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ఆకుపచ్చ, నీలం రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
బంధువులతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వివాహాది వేడుకలు వాయిదా పడే అవకాశం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు కొంత వేధిస్తాయి. కళారంగం వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో వాహనయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top