ఈ రాశివారికి పలుకుబడి పెరుగుతుంది

Today Horoscope In Telugu-31-08-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.నవమి రా.2.01 వరకు, తదుపరి దశమి నక్షత్రం రోహిణి ఉ.9.02 వరకు, తదుపరి మృగశిర వర్జ్యం ప.3.10 నుండి 4.57 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.07 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.36 వరకు అమృతఘడియలు... రా.1.46 నుండి 3.32 వరకు.

సూర్యోదయం :    5.48
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. భాగస్వామ్య వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: చేపట్టిన  పనులు అనుకున్న విధంగా సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి.

మిథునం: బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: ప్రయత్నాలకు సన్నిహితుల చేయూత. పనులలో ముందడుగు వేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం అందుతుంది. అదనపు ఆదాయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహం.

సింహం: కొత్త పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో ముందంజ. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు.

కన్య: కుటుంబసభ్యులతో లేనిపోని వివాదాలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాల్లో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాల్లో చిక్కులు.

తుల: అనుకోని సంఘటనలు. విలువైన వస్తువులు జాగ్రత్త.. ఆప్తులతో వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలలో పురోగతి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగాల్లో సమస్యలు తీరతాయి. 

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఆదాయం పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు.

మకరం: ముఖ్యమైన పనులు వాయిదా. మిత్రులతో కలహాలు. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పుతాయి. ఆధ్యాత్మిక భావాలు పెంచుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: పరిస్థితులు అనుకూలించవు. రాబడి కంటే ఖర్చులు అధికం. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉంటాయి.

మీనం: ఉద్యోగ, వివాహయత్నాలు సానుకూలం. సంఘంలో గౌరవమర్యాదలు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనయోగం. సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి పోస్టులు.
 

 
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top