ఈ రాశివారి వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు

Today Horoscope Telugu-26-7-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, తిథి బ.తదియ తె.4.44 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి చవితి, నక్షత్రం ధనిష్ఠ ప.12.44 వరకు తదుపరి శతభిషం, వర్జ్యం రా.7.59 నుండి 9.34 వరకు దుర్ముహూర్తం ప.12.30 నుండి 1.22 వరకు తదుపరి ప.3.06 నుండి 3.56 వరకు, అమృతఘడియలు... తె.5.36 నుండి 7.14 వరకు (తెల్లవారితే మంగళవారం)

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

రాశి ఫలాలు:

మేషం: పనులు వేగవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి ధనలబ్ధి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: కష్టానికి ఫలితం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నుంచి విముక్తి.

మిథునం: వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ముఖ్య నిర్ణయాలు. మిత్రులతో విభేదాల పరిష్కారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది..

తుల: వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఆదరణ. పరిచయాలు విస్తృతమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనులలో అవాంతరాలు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top