ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. విందువినోదాలు

Today Horoscope Telugu 23-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి బ.చవితి ప.3.14 వరకు, తదుపరి పంచమి నక్షత్రం ఆశ్లేష రా.12.11 వరకు, తదుపరి మఖ, వర్జ్యం ప.12.17 నుండి 1.58 వరకు, దుర్ముహూర్తం ఉ.10.11 నుండి 10.54 వరకు తదుపరి ప.2.54 నుండి 3.15 వరకు అమృతఘడియలు... రా.10.26 నుండి 12.10 వరకు.

సూర్యోదయం :    6.30
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల అన్వేషణ. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనయోగం. చర్చలు సఫలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు  అంతగా కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుకుంటారు. ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొంటారు. దూరపు బంధువుల కలయిక. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

వృశ్చికం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కష్టించినా ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్యం. పనులు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు: ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. కొత్త పనులకు శ్రీకారం. ధనలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం: ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. భూలాభాలు. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి సమస్యలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top