Today Horoscope: ఈ రాశివారికి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి

Today Horoscope In Telugu 21-02-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.పంచమి రా.7.47 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం చిత్త సా.4.26 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం రా.9.44 నుండి 11.16 వరకు, దుర్ముహూర్తం ప.12.35 నుండి 1.21 వరకు తదుపరి ప.2.54 నుండి 3.41 వరకు అమృతఘడియలు... ఉ.10.09 నుండి 11.42 వరకు.

సూర్యోదయం :    6.29
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

మేషం:వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. ఆస్తులు కొంటారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

సింహం: కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కన్య: రుణయత్నాలు సాగిస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో కొన్ని సమస్యలు. అనారోగ్యం. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

తుల: కొత్త  వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిచయాలు పెరుగుతాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.

వృశ్చికం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో కలహాలు. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆకస్మిక ధనలాభం. కొత్త మిత్రుల పరిచయం. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ కృషి ఫలించి పేరు సంపాదిస్తారు.

మకరం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

కుంభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అయోమయంగా ఉంటుంది. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. దైవచింతన.

మీనం: మిత్రులే శత్రువులవుతారు. ఆలోచనలు నిలకడగా సాగవు. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ వృథా కాగలదు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top