ఈ రాశివారికి బంధువులతో శుభవార్తలు. వాహనయోగం..

Today Horoscope Telugu In 19-10-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.చతుర్దశి సా.6.30 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ప.12.54 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం రా.1.30 నుండి 3.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.03 వరకు, తదుపరి రా.10.31 నుండి 11.21 వరకు అమృతఘడియలు... ఉ.7.54 నుండి 9.32 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. వాహనాలు కొంటారు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: దూరపు బంధువుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

తుల: బంధువులతో శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృశ్చికం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: రాబడి అంతగా కలసిరాదు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. భూవివాదాలు నెలకొంటాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మకరం: కుటుంబసభ్యులతో సత్సంబంధాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: కుటుంబంలో చికాకులు. పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్య సూచనలు. సన్నిహితులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top