Today Horoscope: ఈ రాశి వారు విందు, వినోదాల్లో పాల్గొంటారు

Today Horoscope In Telugu 19 04 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.తదియ రా.7.41 వరకు, తదుపరి చవితి నక్షత్రం విశాఖ ఉ.6.27 వరకు, తదుపరి అనూరాధ తె.4.43 వరకు (తెల్లవారితే బుధవారం), వర్జ్యం ఉ.10.14 నుండి 11.43 వరకు దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.48 నుండి 11.34 వరకు, అమృతఘడియలు... ప.12.15 నుండి 1.56 వరకు..

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

రాశి ఫలాలు.. 

మేషం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో మనస్పర్థలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: సన్నిహితులు, సోదరులతో సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

సింహం: రాబడి కనిపించదు. ఆస్తులు వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. బంధువుల నుంచి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

వృశ్చికం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. నిర్ణయాలలో జాప్యం.వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

మకరం: శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

కుంభం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. రాబడికి లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిడులు పెరుగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top