Daily Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు.. ధనవ్యయం

Today Horoscope In Telugu 19-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి బ.విదియ పూర్తి (24 గంటలు), నక్షత్రం ఆశ్లేష పూర్తి (24గంటలు) వర్జ్యం ఉ.7.57 నుండి 9.53 వరకు దుర్ముహూర్తం ప.11.48 నుండి 12.32 వరకు అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.44
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు
 

మేషం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. స్థిరాస్తి వివాదాలు.

వృషభం: పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

మిథునం: కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యవహారాలలో ఆటంకాలు.  బం«ధువిరో«ధాలు. శ్రమాధిక్యం. ముఖ్యమైన నిర్ణయాలు మార్చుకుంటారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆకస్మిక «దనలాభం. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: అనుకోని సంఘటనలు. దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి.వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.  ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు చికాకులు. అనారోగ్యం. 

కన్య: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

తుల: కాంట్రాక్టులు పొందుతారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. వాహన, గృహయోగాలు.

వృశ్చికం: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు. 

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది.ఆరోగ్యసమస్యలు. ఉద్యోగాలలో మార్పులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

మకరం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి., ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆస్తిలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. 

కుంభం: కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులతో తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు.

మీనం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. కాంట్రాక్టులు లభిస్తాయి. బంధువుల కలయిక. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top