ఈ రాశివారు కొత్త ఉద్యోగాలలో చేరతారు..

Today Horoscope Telugu In 18-10-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.త్రయోదశి, సా.6.15 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం పూర్వాభాద్ర ప.12.06 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.10.01 నుండి 11.41 వరకు దుర్ముహూర్తం ప.12.09 నుండి 12.54 వరకు తదుపరి ప.2.26 నుండి 3.14 వరకు అమృతఘడియలు...లేవు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.34
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: మీ ఆశయాలు నెరవేరవచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. కొత్త ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. 

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.ఇ

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. 

సింహం: పరిచయాలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. ఆలయ దర్శనాలు. 

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ధనవ్యయం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి. 

వృశ్చికం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. మిత్రులతో కలహాలు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆరోగ్యభంగం.  

ధనుస్సు: పనులు విజయవంతంగా పూర్తి. సోదరుల నుంచి ఆస్తిలాభం.  కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.  ఆరోగ్య సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు.
 
కుంభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని «విధంగా ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

మీనం: దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top