Today Horoscope: ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

Today Horoscope In Telugu 18 04 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.విదియ రా.9.40 వరకు, తదుపరి తదియ నక్షత్రం స్వాతి ఉ.7.11 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ప.12.36 నుండి 2.10 వరకు, దుర్ముహూర్తం ప.12.22 నుండి 1.14 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు అమృతఘడియలు...ఉ.11.34 నుండి 1.20 వరకు.

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: కార్యసిద్ధి. కీలకమైన నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖుల పరిచయం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించినస్థాయిలో ఉంటాయి.

మిథునం: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. దైవదర్శనాలు.

కర్కాటకం: సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు. స్థిరాస్తి లాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: చిన్ననాటి స్నేహితుల కలయిక. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల: ఎటువంటి పరిస్థితులనైనా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది పరుస్తాయి.

వృశ్చికం: బాధ్యతలు పెరుగుతాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. బంధువులతో సత్సంబంధాలు. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: పరిస్థితుల ప్రభావంతో కొంత ఇబ్బంది పడతారు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థికంగా కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top