ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి..

Today Horoscope In Telugu 18-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం బ.పాడ్యమి తె.5.57 వరకు(లె ల్లవారితే బుధవారం), తదుపరి విదియ నక్షత్రం పుష్యమి తె.6.16 వరకు(తెల్లవారితే బుధవారం), తదుపరి ఆశ్లేష వర్జ్యం ప.12.57 నుండి 2.43 వరకు, దుర్ముహూర్తం ఉ.8.50 నుండి 9.34 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.43 వరకు అమృత ఘడియలు..రా.11.21 నుండి 1.05 వరకు.

సూర్యోదయం :    6.38
సూర్యాస్తమయం    :  5.43
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. బంధువులతో విరోధాలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆసక్తికర సమాచారం. ముఖ్య విషయాలు తెలుస్తాయి. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిణామాలు.

మిథునం: వ్యయప్రయాసలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పెరుగుతాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నత స్థితి.

సింహం: మిత్రులతో అకారణంగా విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు తొలగుతాయి.

తుల: విచిత్ర సంఘటనలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురులేదు.

వృశ్చికం: పనులలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు: బంధువులతో తగాదాలు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. పనులలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కుంభం: విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా ఉంటాయి. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top