ఈ రాశివారికి ప్రయాణాల్లో అవాంతరాలు

Today Horoscope Telugu 16-10-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, శుక్ల పక్ష ఏకాదశి తిథి. ఈ ఏకాదశిని.. పాపాంకుశ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు విష్ణువును పూజించడం వల్ల జీవితంలో సంతోషంగా ఉంటారు. 

రాశి ఫలాలు:

మేషం.. పాతమిత్రులను కలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలాభం.

వృషభం.. తమిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు.

మిథునం..  కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం.

కర్కాటకం.. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తి విషయాలలో  వివాదాలు. వృత్తి,వ్యాపారాలలో చికాకులు.

సింహం.. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. దైవదర్శనాలు.

కన్య.. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో పదోన్నతులు. దైవదర్శనాలు.

తుల.. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం.. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు.. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

మకరం.. వ్యయప్రయాసలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగులకు పనిభారం. అనుకోని ప్రయాణాలు. పనులు నిదానంగా సాగుతాయి.

కుంభం.. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో గౌరవం. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

మీనం.. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో అవాంతరాలు. మానసిక అశాంతి. దైవదర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top