Daily Horoscope:ఈ రాశివారు కొత్త పనులు ప్రారంభిస్తారు

Today Horoscope In Telugu 16-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం; ఉత్తరాయనం హేమంత రుతుతు; పుష్యమాసం; శుక్ల పక్షం చతుర్ధశి: రాత్రి. 2.39 తదుపరి పూర్ణిమ, ఆరుద్ర: రాత్రి2.01 తదుపరి పునర్వసు, వర్జ్యం: ఉదయం 8.47 నుంచి 19. 33 వరకు, అమృత ఘడియలు: మధ్యాహ్నం 2.58 నుంచి 4.44 వరకు దర్ముహూర్తం: సాయంత్రం 4.13 నుంచి 4.57 వరకు రాహుకాలం: సాయంత్రం 4. 30 నుంచి 6.00 వరకు

కనుమ పండగ(ఆదివారం),
సూర్యోదయం: ఉదయం 6.39,
సూర్వాస్తమయం: సాయంత్రం 5.2

రాశి ఫలాలు:

మేషం.. కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. రావలసిన సొమ్ము అందుతుంది. భూలాభాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

వృషభం.. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం.. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం.  ప్రతిభాపాటవాలకు గుర్తింపు రాగలదు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం.. శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు సామాన్యస్థితిలో ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం.  మిత్రులతో  కలహాలు.

సింహం.. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. వాహనయోగం. చర్చలు సఫలం.

కన్య.. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలలో అనుకూలత.  ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. దైవదర్శనాలు.

తుల.. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి  ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృశ్చికం.. ముఖ్యమైన పనులలో స్వల్ప ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు.. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ముఖ్య నిర్ణయాలు.

మకరం.. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కుంభం.. వ్యవహారాలలో అవరోధాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో విరోధాలు.. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం.. అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top