Today Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు

Today Horoscope In Telugu 15-04-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.చతుర్దశి రా.1.54 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం ఉత్తర ఉ.8.45 వరకు, తదుపరి హస్త,వర్జ్యం సా.5.04 నుండి 6.40 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.13 వరకు అమృతఘడియలు...రా.2.38 నుండి 4.13 వరకు

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం     :  6.11
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు
 

మేషం: కార్యజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. అందరిలోనూ గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా వృద్ధి చెందుతాయి.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధుమిత్రులతో విరోధాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం: రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

సింహం: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలలో కొంత అనుకూలత. ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

కన్య: స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉధ్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. వస్తులాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top