Daily Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి

Today Horoscope In Telugu 15-02-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.చతుర్దశి రా.9.14 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం పుష్యమి ప.1.35 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం రా.3.18 నుండి 5.01 వరకు, దుర్ముహూర్తం ఉ.8.47 నుండి 9.33 వరకు తదుపరి రా.10.57 నుండి 11.48 వరకు, అమృతఘడియలు... ఉ.6.40 నుండి 7.54 వరకు, మాఘ పౌర్ణమి.

సూర్యోదయం :    6.32
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

మేషం: క్రయవిక్రయాలలో నిరాశ. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవదర్శనాలు. ఉద్యోగస్తులు విధుల్లో తొందరపాటు తగదు.

వృషభం: మీ అభిప్రాయాలను మిత్రులు గౌరవిస్తారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పొరపాటు నిర్ణయాలను సరిదిద్దుకుంటారు. 
వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: మిత్రులతో విభేదిస్తారు. సమయానికి సొమ్ము రావడం కష్టమే. ప్రయాణాలు మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: బంధువులు మీపై ఆదరణ చూపుతారు. అనుకున్న పనుల్లో విజయం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో అకారణంగా విరోధాలు. అనారోగ్యం. వ్యాపారస్తులు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కీలక మార్పులు.

కన్య: సన్నిహితులతో సఖ్యత. చర్చలు సఫలం. వాహనసౌఖ్యం. భూములు కొనుగోలు చేస్తారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. వాహనాలు కొంటారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృశ్చికం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. పనులు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూలాభాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: కీలక నిర్ణయాలు. పనుల్లో విజయం. విద్యావకాశాలు దక్కుతాయి. సంఘంలో గౌరవం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు. ఆలయ దర్శనాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top