ఈ రాశివారికి పనుల్లో విజయం, చర్చల్లో పురోగతి

Today Horoscope In Telugu 13-03-2022 - Sakshi

శ్రీ ప్లవనామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం  తిథి శు.దశమి ఉ.8.46 వరకు  తదుపరి ఏకాదశి, నక్షత్రం పునర్వసు సా.6.44 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం రా.3.26 నుండి 5.11 వరకు, దుర్ముహూర్తం సా.4.31 నుండి 5.18 వరకు, అమృతఘడియలు... సా.4.05 నుండి 7.50 వరకు

సూర్యోదయం 6.14
సూర్యాస్తమయం 6.05
రాహుకాలం సా.4.30 
నుండి 6.00 వరకు
యమగండం ప.12.00 నుండి 1.30 వరకు

దినఫలాలు:

మేషం.. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం.. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. అంచనాలు నిజమవుతాయి.దేవాలయ దర్శనాలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వస్తులాభాలు.

మిథునం.. ఆదాయం అంతగా కనిపించదు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి.ఆలయాల దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్యభంగం. ధనవ్యయం.

కర్కాటకం.. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు.

సింహం.. రాబడి తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. బంధువిరోధాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థులకు నిరుత్సాహమే.

కన్య.. అనుకోని ధనలాభం. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు, సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. వాహనయోగం.

తుల.. జీవితభాగస్వామి ద్వారా ఆస్తిలాభం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. పనులలలో విజయం. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. వాహనయోగం. చర్చల్లో పురోగతి.

వృశ్చికం.. చేపట్టిన పనులు కొన్ని ముందుకు సాగవు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

ధనుస్సు.. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కష్టపడ్డా ఫలితం ఉండదు. మానసిక అశాంతి.వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. అనారోగ్య సూచనలు. బంధువులతో మాటపట్టింపులు.

మకరం.. కొత్త విషయాలు గ్రహిస్తారు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు. కార్యజయం.శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. నూతన విద్యావకాశాలు.

కుంభం.. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు.చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం.. విద్యార్థుల కృషి ఫలించదు. ఆస్తి వివాదాలు. మానసిక ఆందోళన. అనారోగ్యం. కళాకారులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ప్రయాణాలలో అవాంతరాలు. దైవచింతన.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top