Horoscope Today: ఈ రాశి వారు ఆసక్తికర సమాచారం వింటారు..

Today Horoscope Telugu 10-10-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి శు.చవితి ఉ.8.56 వరకు, తదుపరి పంచమి నక్షత్రం అనూరాధ రా.7.35 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం రా.12.47 నుండి 2.16 వరకు దుర్ముహూర్తం సా.4.06 నుండి 4.54 వరకు, అమృతఘడియలు... ఉ.9.55 నుండి 10.54 వరకు, శుభసమయాలు..ప.2.02 నుండి 3.46 వరకు.

సూర్యోదయం        :  5.55
సూర్యాస్తమయం    :  5.40
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పరిస్థితులు అంతగా అనుకూలించవు. వ్యయప్రయాసలు. ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్య పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. ఆదాయం అంతగా లేక అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: కార్యక్రమాలు ముందుకు సాగవు. కష్టమే మిగులుతుంది. ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో అకారణంగా వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

కన్య: పనుల్లో విజయం. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

తుల: కొత్త రుణయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు సానుకూలం. పరిచయాలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

ధనుస్సు: ముఖ్య పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

మకరం: ఇంట శుభకార్యాల ప్రస్తావన ఆదాయం సంతృప్తినిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

కుంభం: కొత్త  పనులు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top