ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం..

Today Horoscope In Telugu 07-04-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.షష్ఠి సా.6.20 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం మృగశిర రా.8.47 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ఉ.9.58 నుండి 10.47 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు అమృతఘడియలు... ఉ.11.03 నుండి 12.44 వరకు..

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

రాశి ఫలాలు..

మేషం: పనులు అనుకున్న విధంగా పూర్తి. సంఘంలో ఆదరణ. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: మిత్రులే శత్రువులుగా మారతారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: వ్యవహార విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కన్య: రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. చర్చలు సఫలం. నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో వృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మకరం: రుణభారాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అదనపు బాధ్యతలు.

కుంభం: సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

మీనం: దూరప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలు మందగిస్తాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top