ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి

Today Horoscope In Telugu 07-01-2022 - Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.పంచమి సా.4.20 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం శతభిషం ప.11.31 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం సా.5.54 నుండి 7.30 వరకు, దుర్ముహూర్తం ఉ.8.47 నుండి 9.31 వరకు, తదుపరి ప.12.28 నుండి 1.11 వరకు, అమృతఘడియలు... తె.3.25 నుండి 5.03 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం :    6.36
సూర్యాస్తమయం     :  5.36
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం.. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

వృషభం...ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథునం....పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం... కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి.

సింహం...వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య...దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకుంటారు. సోదరుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల....కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. నిర్ణయాలు మార్చుకుంటారు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వృశ్చికం...కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. నిరుద్యోగులకు నిరుత్సాహం. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

ధనుస్సు...చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం...కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులకు గందరగోళం. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం...నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం...శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిదానం అవసరం.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top