Daily Horoscope: ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope In Telugu 06-03-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శు.చవితి రా.10.29 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం అశ్వని తె.5.07 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి భరణి, వర్జ్యం రా.12.54 నుండి 2.34 వరకు, దుర్ముహూర్తం సా.4.28 నుండి 5.15 వరకు, అమృతఘడియలు... ఉ.9.33 నుండి 11.13 వరకు.

సూర్యోదయం        :  6.20
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

రాశి ఫలాలు:
మేషం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. పనులలో పురోగతి సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

వృషభం... బంధువులతో వివాదాలు. ధనవ్యయం. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దైవదర్శనాలు.

మిథునం... శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా  పనులు పూర్తి చేస్తారు. సంఘంలోగౌరవం. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలు ఆశాజకనంగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు.

కర్కాటకం... కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. వాహనయోగం.

సింహం... ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది. 

తుల... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం... దూరపు బంధువుల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. వాహనయోగం. భూవివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు... కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

మకరం... రుణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.

కుంభం... ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. 

మీనం... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top