Daily Horoscope: ఈ రాశి వారికి అనుకోని ప్రయాణాలు.. కొన్ని సమస్యలు..

Today Horoscope Telugu 05-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయన, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి శు.పాడ్యమి.11.22 వరకు, తదుపరి విదియ, నక్షత్రం జ్యేష్ఠ ఉ.10.08 వరకు, తదుపరి మూల వర్జ్యం సా.5.34 నుండి 7.05 వరకు, దుర్ముహూర్తం సా.3.51 నుండి 4.35 వరకు, అమృతఘడియలు... రా.2.34 నుండి 4.05 వరకు.

సూర్యోదయం        :  6.20
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: రాబడి కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మిథునం: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.

సింహం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

కన్య: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.

ధనుస్సు: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

కుంభం: శ్రమలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top