ఈ రాశివారి వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి

Today Horoscope In Telugu 05-01-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి శు.తదియ సా.6.44 వరకు, తదుపరి చవితి నక్షత్రం శ్రవణం ప.12.50 వరకు, తదుపరి ధనిష్ఠ వర్జ్యం సా.4.41 నుండి 6.15 వరక దుర్ముహూర్తం ప.11.44 నుండి 12.26 వరకు అమృతఘడియలు... రా.1.55 నుండి 3.27 వరకు.

సూర్యోదయం :    6.35
సూర్యాస్తమయం    :  5.35
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశిఫలాలు:

మేషం: ఆస్తిలాభం. పనులు సకాలంలో పూర్తి. ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

వృషభం: ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా సాగుతాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

మిథునం:   వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం.

కర్కాటకం: ఆధ్యాత్మిక చింతన. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. బాకీలు వసూలవుతాయి.

సింహం:  కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.

కన్య: వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. చర్చల్లో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు.

తుల: ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనుల్లో అవరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు:   దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సజావుగా సాగుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక.  పనులు సకాలంలో పూర్తి.

మకరం:  దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనుకున్న పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

మీనం:  బంధువుల కలయిక. శ్రమ ఫలిస్తుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. వ్యవహారాలు విజయం. శుభవార్తలు వింటారు. పాతబాకీలు వసూలవుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top