ఈ రాశివారికి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి

Today Horoscope In Telugu-02-09-2021 - Sakshi

శ్రీ ప్లవనామ సంవత్సరం,దక్షిణాయనం, వర్ష ఋతువు,శ్రావణ మాసం తిథి బ.ఏకాదశి తె.5.18 వరకు (తెల్లవారితే శుక్రవారం) తదుపరి ద్వాదశి, నక్షత్రం ఆరుద్ర ప.1.49 వరకు,తదుపరి పునర్వసు వర్జ్యం రా.9.44 నుండి 11.27 వరకు, దుర్ముహూర్తం ఉ.9.55 నుండి 10.45 వరకు తదుపరి ప.2.54 నుండి 3.44 వరకు

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.12
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. విలువైన సమాచారం. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సాపీగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. 

వృషభం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. 

మిథునం: ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు. వ్యవహారాల్లో విజయం.  పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి. 

కర్కాటకం: దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చర్చలు ముందుకు సాగవు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పనిభారం. 

సింహం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో పురోగతి.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. బంధువుల కలయిక. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో విరోధాలు. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.

వృశ్చికం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. బంధువుల నుంచి విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో చిక్కులు.

ధనుస్సు: నూతన ఉద్యోగయోగం. ముఖ్య సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: కొత్త ఉద్యోగయత్నాలు సఫలం. ఆర్థిక విషయాలలో అనుకూలత. పనులు సమయానికి  పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు.  ప్రయాణాల్లో మార్పులు. వివాదాలు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు మార్పులు.

మీనం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top