Daily Horoscope: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధనలాభం

Today Horoscope Telugu 01-12-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి బ.ద్వాదశి రా.8.12 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం చిత్త సా.4.10 వరకు, తదుపరి స్వాతి వర్జ్యం రా.9.26 నుండి 10.57 వరకు దుర్ముహూర్తం ప.11.25 నుండి 12.10 వరకు అమృతఘడియలు... ఉ.9.58 నుండి 11.30 వరకు.

సూర్యోదయం :    6.16
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పనులు సకాలంలో చక్కదిద్దుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. వృ«థా ఖర్చులు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: పనులు కొంత మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. భూలాభాలు. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ.

కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

మకరం: కుటుంబంలో చికాకులు. బంధువులతో తగాదాలు. స్థిరాస్తి వివాదాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. పనులు నిదానిస్తాయి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top