Daily Horoscope: ఈ రాశివారు వాహనాలు, ఆభరణాలు కొంటారు

Today Horoscope In Telugu 01-03-2022 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి బ.చతుర్దశి రా.12.54 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం ధనిష్ఠ రా.3.56 వరకు, తదుపరి శతభిషం వర్జ్యం ఉ.10.11 నుండి 11.47 వరకు, దుర్ముహూర్తం ఉ.8.45 నుండి 9.33 వరకు, తదుపరి రా.10.57 నుండి 11.46 వరకు అమృతఘడియలు... సా.5.58 నుండి 7.29 వరకు, మహాశివరాత్రి.

సూర్యోదయం :    6.23
సూర్యాస్తమయం    :  6.02
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం... పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఉద్యోగలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

వృషభం... ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం... కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. శ్రమాధిక్యం. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం... వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు.

సింహం... వ్యవహారాలలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

కన్య... కొన్ని సమస్యలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల... పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. అనుకున్న పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృశ్చికం... దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. పనులలో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

ధనుస్సు... రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి సహాయం. రాబడి కొంత పెరుగుతుంది. నూతన ఒప్పందాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినవిధంగా కొనసాగుతాయి.

మకరం... సన్నిహితులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణయత్నాలు. బాధ్యతలు అధికమవుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని సమస్యలు.

కుంభం... కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది.

మీనం... వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబబాధ్యతలు అధిగమవుతాయి. ప్రయాణాలు రద్దు. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు నిదానిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top