Daily Horoscope: ఈ రాశివారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు

Today Horoscope 27-04-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.ద్వాదశి రా.1.24 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం పూర్వాభాద్ర సా.6.21 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం రా.3.55 నుండి 5.32 వరకు దుర్ముహూర్తం ఉ.11.30 నుండి 12.22 వరకు అమృతఘడియలు... ఉ.10.27 నుండి 12.02 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:
మేషం... కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు మందగిస్తాయి. నిర్ణయాలు మార్పుచుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

వృషభం... సన్నిహితుల నుంచి ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం... శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కర్కాటకం... వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో మార్పులు.

సింహం... కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. అనారోగ్యం.

కన్య... ఆకస్మిక ధనలబ్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల.... సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

వృశ్చికం... మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు.. కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం.. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ధనలబ్ధి. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం... బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మీనం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top