ఈ రాశివారికి ఆప్తుల నుంచి కీలక సమాచారం

Today Horoscope 25-April-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.దశమి రా.3.54 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం ధనిష్ఠ రా.7.36 వరకు, తదుపరి శతభిషం వర్జ్యం రా.2.33 నుండి 4.06 వరకు, దుర్ముహూర్తం ప.12.21 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు అమృతఘడియలు... ఉ.9.44 నుండి 11.15 వరకు.

సూర్యోదయం :    5.42
సూర్యాస్తమయం    :  6.13
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

రాశి ఫలాలు:

మేషం... పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం... శ్రమ పెరగవచ్చు. రాబడి, ఖర్చులు సమానంగా ఉంటాయి. దూరప్రయాణాలు. సోదరులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం... వనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

కర్కాటకం... పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం... విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్య... రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ప్రయాణాలు చేస్తారు. శ్రమా«ధిక్యం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల... పనుల్లో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తులు వివాదాలు. సోదరుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు.

వృశ్చికం... కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

ధనుస్సు... కొత్తరుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. పనులలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మకరం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

కుంభం... మిత్రులతో కలహాలు. వ్యవహారాలలో అవాంతరాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. కష్టమే తప్పితే ఫలితం ఉండదు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

మీనం... నూతన పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top