Horoscope Today: ఈ రాశి వారికి అన్నింటా అనుకూల వాతావరణం

Today Horoscope 21-07-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.అష్టమి ప.12.11 వరకు, తదుపరి నవమి, నక్షత్రం అశ్విని సా.6.44 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ప.2.36 నుండి 4.15 వరకు తిరిగి తె.4.45 నుండి 6.26 వరకు (తెల్లవారితే శుక్రవారం) దుర్ముహూర్తం ఉ.9.55 నుండి 10.47 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.57 వరకు, అమృతఘడియలు... ఉ.11.19 నుండి 12.56 వరకు. 

సూర్యోదయం :    5.38
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వృషభం: బంధువులతో మాటపట్టింపులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కర్కాటకం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: బంధువుల ఒత్తిడులు పెంచుతారు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు కొంత అసంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కన్య: పనుల్లో  జాప్యం. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ముఖ్య నిర్ణయాలు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. మిత్రులతో వివాదాలు. విద్యార్థులకు ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కుంభం: కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ధనలాభం. ఆలయ దర్శనాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మీనం: ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విందువినోదాలు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top