Today Horoscope: ఈ రాశికి శుభవార్తలు అందుతాయి

Today Horoscope 15-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం; తిథి బ.చవితి రా.12.57 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాభాద్ర రా.1.50 వరకు, తదుపరి రేవతి; వర్జ్యం ఉ.11.38 నుండి 1.15 వరకు.. దుర్ముహూర్తం ప.12.28 నుండి 1.21 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.52 వరకు అమృత ఘడియలు రా.9.04నుండి 10.41 వరకు.. రాహుకాలం ఉ.7.30 నుండి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుండి 12.00 వరకు సూర్యోదయం 5.46; సూర్యాస్తమయం 6.23.

మేషం: పనులలో ప్రతిబంధకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువుల తాకిడి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. కొత్త పనులు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల చేయూత అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కర్కాటకం: పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూవివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

తుల: వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. విందువినోదాలు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: రుణయత్నాలు సానుకూలం. చిత్రమైన సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. చర్చలలో పురోగతి. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. దైవదరర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిపరుస్తాయి.

మీనం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యవహారాలలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కలసివస్తాయి.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top