Today's Horoscope: ఈ రాశివారు శుభవార్తలు వింటారు

Today Horoscope 07-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం తిథి శు. దశమి రా.7.34 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం అనూరాధ ప.1.24 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం సా.6.38 నుండి 8.11 వరకు, దుర్ముహూర్తం సా.4.46 నుండి 5.36 వరకు, అమృతఘడియలు.. రా.3.43 నుండి 5.43 వరకు.

సూర్యోదయం        :  5.43
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. 

వృషభం: కొత్త మిత్రుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. సన్మానాలు. 

మిథునం: బంధువులను కలుసుకుంటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత. కుటుంబసౌఖ్యం.

కర్కాటకం: ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. రుణాలు చేస్తారు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. 

సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిర్ణయాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. 

కన్య: ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. దూరపు బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

తుల: రుణయత్నాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యవహారాలలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. 

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

ధనుస్సు: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు. 

మకరం: వ్యవహారాలలో అనుకూలత. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార వృద్ధి. 

కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. 

మీనం: బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడులు. 

 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top