దినఫలం: ఈ రాశివారు భూములు కొంటారు, ఆదాయం పెరుగుతుంది, మిగతా రాశులవారికి ఎలా ఉందంటే..

Today Horoscope 07 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శనివారం
సూర్యోదయం 6.36; సూర్యాస్తమయం 5.36. 

 
తిథి:  బ.పాడ్యమి తె.5.24 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి విదియ,
నక్షత్రం: పునర్వసు రా.2.07 వరకు, తదుపరి పుష్యమి,
వర్జ్యం: ప.12.50 నుండి 2.36 వరకు,
దుర్ముహూర్తం: ఉ.6.35 నుండి 8.04 వరకు,
 

అమృతఘడియలు: రా.11.25 నుండి 1.11 వరకు;
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు;

మేషం: రాబడి అంతగా ఉండదు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వృషభం: ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఆదాయం సంతృప్తినిస్తుంది. శత్రువులుసైతం అనుకూలంగామారతారు. వ్యాపారాలలో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. దేవాలయదర్శనాలు. 

మిథునం: బంధువులతో అకారణవైరం. వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి.అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కర్కాటకం: కొత్త పరియాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. 

సింహం: కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ధననష్టం. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. యత్నకార్యసిద్ధి. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆశయాలు నెరవేరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా సాగుతాయి.
 
తుల:
చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న విధంగా సాగుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గౌరవం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. 

వృశ్చికం: కార్యక్రమాలలో అవరోధాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. దేవాలయదర్శనాలు. 

ధనుస్సు: కృషి ఫలించదు. అనారోగ్య సూచనలు. బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు మార్పులు. ఉదర సంబంధిత రుగ్మతలు.

మకరం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. అంచనాలు నిజం చేసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. కార్యజయం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆశించిన సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. 

మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలుస్థిరంగా ఉండవు. ప్రయాణాలలో అటంకాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు. దేవాలయదర్శనాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top