ఈ రోజు రాశి ఫలాలు 04-10-2022

Today Horoscope 04-10-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.నవమి ప.1.39 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.11 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం: రా.2.43 నుండి 4.13 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.36 నుండి 11.24 వరకు అమృతఘడియలు: సా.5.12 నుండి 6.41 వరకు, మహర్నవమి.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.46
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాల. ప్రయాణాలలో అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తిలాభం. ఆర్థిక పరిస్థితి  మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: శ్రమ ఫలించే సమయం. ఆప్తుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా ఉంటాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కన్య: రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు కొన్ని వాయిదా పడతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

తుల: శుభవర్తమానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృశ్చికం: కుటుంబంలో ఒడిదుడుకులు. బంధువుల నుండి సమస్యలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు తీరతాయి. ఆప్తులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: పనుల్లో మరింత జాప్యం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. అనారోగ్యం. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు ఫలితం పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

మీనం: చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. మానసిక ప్రశాంతత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top