Today's Horoscope: ఈ రాశివారికి పరిస్థితులు అనుకూలిస్తాయి..

Today Horoscope 04-07-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.పంచమి ప.2.33 వరకు, తదుపరి షష్ఠి  నక్షత్రం మఖ ఉ.6.08 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ప.2.30 నుండి 4.10 వరకు, దుర్ముహూర్తం ప.12.29 నుండి 1.22 వరకు తదుపరి ప.3.05 నుండి 3.56 వరకు అమృతఘడియలు... రా.12.34 నుండి 2.15 వరకు.

సూర్యోదయం :    5.33
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఉద్యోగావకాశాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: ఆప్తుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మిథునం: బంధువులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. మరింత హుషారుగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కన్య: దీర్ఘకాలిక రుణబాధలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

వృశ్చికం: మీ ఆశయాలు నెరవేరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: పనుల్లో కొంత ఇబ్బంది. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మకరం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top