దిన ఫలం: ఈ రాశివారికి వ్యాపారాల్లో లాభాలు.. ఆశించిన డబ్బు సమకూరుతుంది

Today Horoscope 04 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, బుధవారం
సూర్యోదయం 6.36; సూర్యాస్తమయం 5.35. 
తిథి: శు.త్రయోదశి రా.12.00 వరకు, తదుపరి చతుర్దశి,
నక్షత్రం: రోహిణి రా.7.28 వరకు, తదుపరి మృగశిర,

వర్జ్యం: ఉ.10.58 నుండి 12.42 వరకు, తిరిగి రా.1.30 నుండి 3.14 వరకు..
దుర్ముహూర్తం: ప.11.44 నుండి 12.27 వరకు..
అమృత ఘడియలు: సా.4.03 నుండి 5.45 వరకు..
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు.

 

మేషం: కార్యక్రమాలలో ఆటంకాలు. బంధుగణం నుంచి విమర్శలు. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగాల్లో శ్రమ. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. 

వృషభం: దూరపు బంధువుల కలయిక. శుభకార్యాల రీత్యా ఖర్చులు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారులకు అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు చిక్కులు తొలగే సమయం..

మిథునం: కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో ఆటంకాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారులకు అంతగా లాభాలు అందవు. ఉద్యోగులకు విధుల్లో ఒడిదుడుకులు. 

కర్కాటకం: కార్యజయం. ఆహ్వానాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అనుకున్న రాబడి ఉంటుంది. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. 

సింహం: నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు.ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  వాహన, గృహయోగాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. 

కన్య: బంధుమిత్రుల నుంచి విమర్శలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  వివాదాలు.  ఆస్తి వివాదాలు నెలకొంటాయి. దైవదర్శనాలు.

తుల: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. బంధువులతో విభేదాలు. అంచనాలు తారుమారు. కార్యక్రమాలలో ప్రతిబంధకాలు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగవర్గాలకు విధి నిర్వహణలో చిక్కులు.

వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆశించిన డబ్బు సమకూరుతుంది. భూములు, భవనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. .

ధనుస్సు: ఉద్యోగప్రయత్నాలు కలిసివస్తాయి. బంధువులతో తగాదాలు తీరతాయి. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ఉత్సాహం.

మకరం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో చికాకులు. వాహనాలు, ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. 

కుంభం: అనుకోని ప్రయాణాలు. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆరోగ్యభంగం. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

మీనం: దూరప్రాంతాల నుంచి ముఖ్యసమాచారం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారులు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top