దిన ఫలం: ఈ రాశివారికి అనుకోని విధంగా బాకీలు వసూలవుతాయి

Today Horoscope 03 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు, పుష్యమాసం, 
తిథి: శు.ద్వాదశి రా.11.02 వరకు, తదుపరి త్రయోదశి, 
నక్షత్రం: కృత్తిక సా.6.03 వరకు, తదుపరి రోహిణి, 

సూర్యోదయం :  6.36
సూర్యాస్తమయం:  5.34

వర్జ్యం: లేదు, 
దుర్ముహూర్తం: ఉ.8.46 నుండి 9.30 వరకు, తదుపరి రా.10.45 నుండి 11.37 వరకు, 

అమృతఘడియలు: ప.3.30 నుండి 5.10 వరకు.

రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

 

మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం: శ్రమ కలిసివస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు విశేషంగా రాణిస్తాయి.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గురుకు వస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటారు.

సింహం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్య సందేశం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య: రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. బంధుగణంతో తగాదాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు నిదానిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

తుల: వ్యవహారాలు మధ్యలో విరమిస్తారు. లేనిపోని వివాదాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా కొనసాగుతాయి.

వృశ్చికం: శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

ధనుస్సు: మీ మనస్సులోని భావాలను వెల్లడిస్తారు. సమాజసేవలో పాల్గొంటారు. అనుకోని విధంగా బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: రాబడి, వ్యయం సమానంగా ఉంటాయి. కొన్ని ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. సోదరులు, మిత్రుల ద్వారా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top