ఈ రాశివారికి వ్యాపారాలలో లాభాలు.. ఉద్యోగాలలో ఒత్తిడులు

Today Horoscope 02-11-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.నవమి రా.10.53 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ధనిష్ఠ తె.4.06 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి శతభిషం, వర్జ్యం: ఉ.9.20 నుండి 10.52 వరకు, దుర్ముహూర్తం: ప.11.20 నుండి 12.05 వరకు, అమృతఘడియలు: సా.6.20 నుండి 7.50 వరకు; రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు; సూర్యోదయం 6.02; సూర్యాస్తమయం 5.26. 

మేషం: రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.మిత్రుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో ఆదరణ. పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

వృషభం: సన్నిహితులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ప్రయాణాలలో మార్పులు. ఆ«ధ్యాత్మిక చింతన. అనారోగ్యం. నిరుద్యోగులకు కొంత నిరాశ. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కర్కాటకం: ఖ్యాతి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. మిత్రుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు.

సింహం: శుభకార్యాల ప్రస్తావన. బాకీలు కొన్ని వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కన్య: పనులలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. దైవచింతన. వ్యాపారాలు సామాన్యం ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

ధనుస్సు: సన్నిహితులు, మిత్రులతో వివాదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు.

మకరం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. ప్రయాణాలలో నూతన పరిచయాలు. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: అనుకున్న పనులలో ఆటంకాలు. ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మీనం: కుటుంబంలో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top