రాశిఫలం: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. అన్నింటా విజయం.. మిగతా రాశులవారికి ఎలాగా ఉందంటే..

Today Horoscope 02 01 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, సోమవారం
సూర్యోదయం 6.35; సూర్యాస్తమయం 5.33. 

తిథి: శు.ఏకాదశి  రా.10.31 వరకు, తదుపరి ద్వాదశి,
నక్షత్రం: భరణి సా.5.04 వరకు, తదుపరి కృత్తిక,
వర్జ్యం: తె.5.31 నుండి 7.10 వరకు(తెల్లవారితే మంగళవారం),
దుర్ముహూర్తం: ప.12.24 నుండి 1.10 వరకు, తదుపరి ప.2.37 నుండి 3.22 వరకు,
అమృతఘడియలు: ప.12.06 నుండి 2.22 వరకు,
వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి;
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు;

మేషం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పరపతి పెరుగుతుంది. విద్యావకాశాలు దక్కుతాయి.  వృత్తి, వ్యాపారాలలో మరింత పురోగతి. ఆలయ దర్శనాలు.

వృషభం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా పెత్తనం చెలాయిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం: మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనుల్లో విజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు సన్మానాలు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వృత్తి,వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. 

సింహం: రుణబాధలు తొలగే సూచనలు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.   వృత్తి,వ్యాపారాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన. విద్యార్థుల యత్నాలలో పురోగతి.

కన్య: ఆర్థిక ఇబ్బందులు కొంత తీరతాయి. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

తుల: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో విశేష గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు: పనులు నిదానిస్తాయి. ఉద్యోగ యత్నాలు కొంత ఫలిస్తాయి. దూరప్రయాణాలు. ధనానికి ఇబ్బంది ఉండదు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత ఉత్సాహవంతంగానే ఉంటుంది.

మకరం: కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని పనులు నిదానిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కుంభం: ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. కళాకారులకు ఊహించని అవకాశాలు..

మీనం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి.  ధనవ్యయం.విద్యార్థులకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. కొన్ని  పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని  మార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top