Today's Horoscope: ఈ రాశివారికి అన్నింటా సక్సెస్‌.. ధన,వస్తు లాభాలు

Today Horoscope 01-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు. చవితి రా.2.33 వరకు, తదుపరి పంచమి నక్షత్రం పుబ్బ ప.2.56 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం రా.10.21 నుండి 12.02 వరకు, దుర్ముహూర్తం ప.12.31 నుండి 1.22 వరకు తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు అమృతఘడియలు... ఉ.8.10 నుండి 9.5 వరకు, నాగచతుర్ధి.

సూర్యోదయం :    5.41
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. శ్రమపడినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: సన్నిహితులే శత్రువులుగా మారతారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిపెట్టవచ్చు. ప్రయాణాలు రద్దు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. ధనలాభం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంచనాలకు తగినట్లుగా ఉంటాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. పనులు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కన్య: ఇంటాబయటా సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో విజయం. ధన, వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూ, ధనలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

ధనుస్సు: రుణాలు చేయాల్సివస్తుంది. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మకరం: ప్రయాణాలలో స్వల్ప మార్పులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

కుంభం: సోదరుల నుండి పిలుపు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

మీనం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top