Daily Horoscope: ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు

horoscope today 01 12 2023 rasiphalalu telugu  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.చవితి ప.3.06 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పునర్వసు సా.5.06 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: రా.1.46 నుండి 3.26 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.28 నుండి 9.16 వరకు, తదుపరి ప.12.11 నుండి 12.59 వరకు, అమృతఘడియలు: ప.2.34 నుండి 4.15 వరకు; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.17, సూర్యాస్తమయం: 5.20. 

మేషం.... సన్నిహితులతో స్వల్ప వివాదాలు. దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. అనారోగ్యం.

వృషభం... కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం... శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.

కర్కాటకం... కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. సంఘంలో ఆదరణ. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

సింహం.... ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

కన్య... నూతన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు.

తుల... పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం... ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఇంటాబయటా బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దైవదర్శనాలు.

మకరం... పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

కుంభం... వ్యవహారాలలో విజయం. ఆప్తుల సాయం అందుతుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. 

మీనం.... కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తివృద్ధి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top