ఈ రాశివారికి ఉద్యోగాలలో ఒత్తిడులు

Daily Horoscope In Telugu 9th June 2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి బ.చతుర్దశి ప.1.09 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం కృత్తిక ఉ.8.33 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం రా.2.17 నుండి 4.05 వరకు,  దుర్ముహూర్తం ప.11.32 నుండి 12.23 వరకు, అమృతఘడియలు... ఉ.5.51 నుంచి 7.38 వరకు

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుండి 9.00 వరకు

రాశి ఫలాలు:

మేషం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యయప్రయాసలు.

వృషభం: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మిథునం: ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. నూతన ఒప్పందాలు.

కర్కాటకం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. పనులలో పురోగతి. ఇంటాబయటా అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కన్య: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయణాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగాలలో మార్పులు.  వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ధనవ్యయం.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: కొత్త పరిచయాలు. పాతబాకీలు వసూలవుతాయి. సంఘంలో గౌరవం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

ధనుస్సు: ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు క్లిష్ట సమస్యలు తీరతాయి. వాహనయోగం.

మకరం: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యవహారాలలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు.

కుంభం: దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం. ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: కొత్త పనులు చేపడతారు. దూరపు బంధువుల కలయిక. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top